మార్కు సువార్త- అధ్యాయం -1
ప్రశ్నలు:
1. యేసును అరణ్యములోనికి ఎవరు త్రోసికొనిపోయెను?
A. పరిశుద్ధాత్మ ఆయనను (యేసును) అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. (1:12)
2. కపెర్నహూములోని సమాజమందిరములో యేసు వారికి ఎలా బోధించెను?
A. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. (1:22)
3. మార్కు సువార్త ప్రకారం ఎవరు నీటితో బాప్తిసమిచ్చెను ఎవరు పరిశుదాత్మలో బాప్తిసమిచ్చెదరు?
A. నేను ( యోహాను) నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన (యేసు) పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.(1:8)
ఖాళీలు:
4. ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. (1:34)
5. ...ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టి-- నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. (1:41)
కంఠత వాక్యము:
కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. (1:15)
మార్కు సువార్త- అధ్యాయం -2
ప్రశ్నలు:
1. పాత బట్టకు కొత్త మాసిక వేసిన యెడల ఏమగును?
A. ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు; వేసినయెడల ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును.(2:21)
2. యేసు, 'నన్ను వెంబడించుము' అని ఎవరితో చెప్పెను?
A. ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను.(2:14)
3.ఎవరి విశ్వాసము చూచి యేసు పక్షవాయువు గలవానిని స్వస్థపరచెను?
A. పక్షవాయువుగలవాని.
B. పక్షవాయువుగలవాని మోసుకువచ్చిన నలుగురు వ్యక్తుల విశ్వాసము. (2: 2&5)
ఖాళీలు:
4. యేసు ఆ మాట వినిరోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కర లేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.(2:17)
5. అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. (2:28)
కంఠత వాక్యము:
అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి పక్ష వాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. (2:10-11)
మార్కు సువార్త- అధ్యాయం -3
ప్రశ్నలు:
1. యేసు ఎందుకు దుఖఃపడెను? పరిసయ్యుల యొక్క....
A. అవిశ్వాశ్వమును బట్టి
B. హృదయ కాఠిన్యమును (3:5)
2. యేసును చూచినప్పుడు అపవిత్రాత్మలు పట్టినవారు ఎం చేసిరి?
A. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడినీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి.(3:11)
3. తనకుతాను విరోధముగా వేరుపడిన యిల్లు ఏమగును?
A. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు. (3:25)
ఖాళీలు:
4. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, సహోదరియు తల్లియునని చెప్పెను.(3:35)
5. ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; (3:27)
కంఠత వాక్యము:
ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి.(3:10)
మార్కు సువార్త- అధ్యాయం -4
ప్రశ్నలు:
1. రాతినేలను పడిన విత్తనము ఎందుకు ఎండిపోయెను?
A. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉద యింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. (4:5-6)
2. భూమి ఏమి పుట్టించును?
A. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును. (4:28)
ఖాళీలు:
3. మరియు ఆయన-- మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. (4:24)
4. మంచి నేలను విత్తబడినవారెవ రనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.(4:20)
5. అందుకాయన లేచి గాలిని గద్దించి -- నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను. (4:39)
కంఠత వాక్యము:
రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచ బడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు. (4:22)
మార్కు సువార్త- అధ్యాయం -5
ప్రశ్నలు:
1. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి విడుదల నొందిన తరువాత దెకపొలిలో ఏం చేసెను?
A. వాడు వెళ్లి, యేసు తనకు చేసినవన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి. (5:20)
2. యేసు యాయీరును సమాజమందిరపు అధికారితో ఏం చెప్పెను?
A. యేసు వారు చెప్పినమాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి..(5:36)
3. మార్కు సువార్త 5వ అధ్యాయములో, యేసు క్రింది వారిని స్వస్థపరచెను?
A. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని రక్తస్రావము కలిగిన స్త్రీని.
B. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని, రక్తస్రావము కలిగిన స్త్రీని & యాయీరు కుమార్తెను.
ఖాళీలు:
4. జనులు జరిగినది చూడ వెళ్లి యేసు నొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి.
5. ఆమె యేసునుగూర్చి విని-- 'నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను.(5:27-28)
కంఠత వాక్యము:
అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. (5:34)
మార్కు సువార్త- అధ్యాయం -6
ప్రశ్నలు:
1. నజరేతులో యేసు ఏ అద్భుతము చేయజాలక పోయెను, ఎందుకు?
A. అందు వలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థ పరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. (6:5)
2. యేసు పండ్రెండు మంది శిష్యులకు దేనిమీద అధికారమిచ్చెను?
A. ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారి కధికారమిచ్చి..(6:7)
3. బాప్తిసమిచ్చు యోహానును హేరోదు ఎందుకు కాపాడుచువచ్చెను?
A. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు విని నప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. (6:20)
ఖాళీలు:
4. కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి. (6:12-13)
5. తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి; (6:51)
కంఠత వాక్యము:
అందుకు యేసుప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. (6:4)
మార్కు సువార్త- అధ్యాయం -7
ప్రశ్నలు:
1. ఏది మనుష్యుని అపవిత్రపరచును?
A. వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునవి.
B. లోపలినుండి బయలు వెళ్లునవి. (7:15-16)
2. ఎప్ఫతా అను మాటకు అర్ధం ఏమిటి?
A. ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడు మని అర్థము.(7:34)
3. ఏవేవి మనుష్యుని హృదయములోనుండి బయటికి వచ్చును?
5. -- ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.(7:37)
ఖాళీలు:
4. మరియు ఆయన --- మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాక రించుదురు. (7:9)
5. ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. (7:37)
కంఠత వాక్యము:
వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. (7:7)
మార్కు సువార్త- అధ్యాయం -8
ప్రశ్నలు:
1. మనుష్యకుమారుడు అనేక హింసలు పొంది ఎవరి చేత ఉపేక్షింపబడును?
A. మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింప బడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను. (8:31)
2. యేసు --- "మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని" శిష్యులనడుగగా పేతురు ఏం చెప్పెను?
A. పేతురు---- నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. (8:29)
3. యేసు --- "నేను వారి మీద కనికర పడుచున్నాను" అనెను ఎందుకు?
A. జనులు నేటికి మూడు దినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున.
B. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారు.
C. A మరియు B (8:2-3)
ఖాళీలు:
4. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము ? (8:36)
5. --- నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్క రింపకున్నావని పేతురును గద్దించెను. (8:33)
కంఠత వాక్యము:
తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును. (8:35)
మార్కు సువార్త- అధ్యాయం -9
ప్రశ్నలు:
1. "మేమెందుకని దయ్యములను వెళ్లగొట్టలేక పోతిమని" శిష్యులు ఆయనను అడిగినందున, యేసు ఏమని చెప్పెను?
A. అందుకాయన ― ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. (9:29)
2. యేసు 'నీ చెయ్యి నిన్ను అభ్యన్తరపరచిన యెడల దానిని నరికివేయుమని' చెప్పెను ఎందుకనగా?
A. అంగహీనుడై జీవములో ప్రవేశించుట మేలు.
B. రెండు చేతులు కలిగి నరకములో పోవుటకంటె.
Ans. A & B- (9:43-44)
3. "ఎవడైనను మొదటివాడై యుండగోరిన యెడల ............... యుండవలెనని", యేసు చెప్పెను?
A. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచిఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి..(9:35)
ఖాళీలు:
4. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతోనిశ్చయముగా చెప్పు చున్నాను.(9:41)
5. మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.
కంఠత వాక్యము:
అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. (9:23)
మార్కు సువార్త- అధ్యాయం -10
ప్రశ్నలు:
1. యేసు నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను ఇంటివారినైనను భూములనైనను విడిచినవారు ఏమి పొందకొందురు?
A. ఇప్పుడు హింసలతోపాటు నూరంతలుగా విడిచిపెట్టిన వాటిని/ వారిని పొందకొందురు.
B. రాబొవులోకమందు నిత్య జీవమును పొందకొందురు.
C. A మరియు B (10:29-30)
2. ఎందుకు ధనవంతుడైన యవ్వనుడు దుఃఖపడుచు వెళ్లిపోయెను?
A. అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను. (10:22)
ఖాళీలు:
3. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.(10:45)
4. ఊరకుండుమని అ నేకులు వానిని గద్దించిరి గాని వాడు---దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను.
5. నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను.
కంఠత వాక్యము:
చిన్నబిడ్డ వలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి..(10:15)
మార్కు సువార్త- అధ్యాయం -11
ప్రశ్నలు:
1. ఆయన దేవాలయములో ప్రవేశించి ఎవరిని వెళ్లగొట్టెను?
A. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవా లయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయ ములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసిదేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్య కుండెను. (11:15-16)
2. యేసు గాడిదపిల్ల మీద కూర్చున్న తరువాత, ఆయన ముందు వెళ్ళుచుండినవారును, వెనుక వచ్చుచుండిన వారును ఏమని కేకలు వేసిరి?
A. మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును జయము
ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.(11:9-10)
3. పేతురు--- "ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని" యేసుతో చెప్పినప్పుడు, ఆయన వారితో ఏమనెను?
A. అందుకు యేసు వారితో ఇట్లనెనుమీరు దేవునియందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్ర ములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమి్మనయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.(11:22-26)
ఖాళీలు:
4. --- నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? (11:17)
5. ఎవడైనను ఈ కొండను చూచి--- నీవు ఎత్తబడి సముద్ర ములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (11:23)
కంఠత వాక్యము:
అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.(11:24)
మార్కు సువార్త- అధ్యాయం -12
ప్రశ్నలు:
1. పరిసయ్యులు, హేరోదీయులు ...."కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయనను అడిగినందున, యేసు వారితో ఏమని చెప్పెను?
A. అందుకు యేసు--- కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.(12:17)
2. ఎందుకు పేద విధవరాలి కానుక అందరి కానుకలకంటే ఘనముగా ఎంచబడెను?
A. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. (12:44)
3. ఎవరిని గూర్చి జాగ్రత్తపడమని యేసు చెప్పెను?
A. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు విధవరాండ్ర యిండ్లు దిగమిం గుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. (12:38-40)
ఖాళీలు:
4. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. (12:27)
5. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను. (12:10)
కంఠత వాక్యము:
అందుకు యేసు---ప్రధానమైనది ఏదనగా--- ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.(12:29-30)
మార్కు సువార్త- అధ్యాయం -13
ప్రశ్నలు:
1. ఎవరిని పోగుచేయుటకు దూతలు పంపబడును?
A. అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును. (13:27)
2. ఎవరు రక్షణ పొందుదురు?
A. అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును. (13:13)
3. శ్రమ దినముల తరువాత ఎవరు వచ్చుట చూచెదరు?
A. ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. (13:24-26)
ఖాళీలు:
4. జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. (13:33)
5. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను --- ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి. (13:5)
కంఠత వాక్యము:
ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. (13:31)
మార్కు సువార్త- అధ్యాయం -14
ప్రశ్నలు:
1. ఎందునిమిత్తము, ఒక స్త్రీ యేసు తల మీద అత్తరు పోసెను?
A. ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.
సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. (14:8-9)
2. గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి......ఆరంభించెను?
A. పేతురును యాకోబును యోహానును వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరంభించెను. (14:33)
3. ప్రధాన యాజకుడు --- పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా, యేసు ఏమని చెప్పెను?
A. యేసు అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. (14:62)
ఖాళీలు:
4. నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను). (14:49)
5. --- కోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. (14:72)
6. ....ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు; (14:41)
కంఠత వాక్యము:
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి..(14:38)
మార్కు సువార్త- అధ్యాయం -15
ప్రశ్నలు:
1. బరబ్బ ఎవరు?
A. అధికారుల నెదిరించి, కలహములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను. (15:7)
2. యేసు స్థానంలో ఎవరు విడుదల చేయబడెను?
A. బరబ్బను (15:15)
3. యేసు ప్రాణము విడిచిన తరువాత ఏం జరిగెను?
A. అప్పుడు దేవాలయపు తెరపైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను. (15:38)
ఖాళీలు:
4. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. (15:15)
5. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. (15:34)
కంఠత వాక్యము:
ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. (15:39)
మార్కు సువార్త- అధ్యాయం -16
ప్రశ్నలు:
1. యేసు లేచిన తర్వాత మొదట ఎవరిని కనబడెను?
A. ఇద్దరు శిష్యులకు
B. మగ్దలేనే మరియకు (16:9)
C. పదునొకొందు మంది శిష్యులకు
2. ఎవరికి శిక్ష విధింపబడును?
A. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. (16:16)
3. సువార్తను నమ్మిన వారిలో ఏ సూచకక్రియలు కనబడును?
A. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. (16:17-18)
ఖాళీలు:
4. వారు బయలుదేరి వాక్య మంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. (16:20)
5. అందుకతడు --- కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. (16:6)
6. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. (16:19)
కంఠత వాక్యము:
--- మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. (16:15)